Governor: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
- ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు గవర్నర్ ఆదేశాలు
- ఈ ఘటన బాధించిందన్న రాహుల్ గాంధీ
- ప్రవళికది ఆత్మహత్య కాదని.... హత్య అని ఆరోపణ
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటన తనను బాధించిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపించారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిల్లాడుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.