World Cup: ఇంగ్లండ్ పై ఫర్వాలేదనిపించే స్కోరు చేసిన ఆఫ్ఘనిస్థాన్

Afghanistan scores a fighting total against England
  • వరల్డ్ కప్ లో నేడు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్
  • రహ్మనుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్ అర్ధసెంచరీలు
  • మూడు వికెట్లు తీసిన ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్
వరల్డ్ కప్ లో నేడు డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, ఆసియా జట్టు ఆఫ్ఘనిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టు ఫర్వాలేదనిపించే స్కోరు చేసింది. 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 

ఓ దశలో ఆఫ్ఘన్ జట్టుకు భారీ స్కోరు చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్ కు కేవలం 16.4 ఓవర్లలోనే 114 పరుగులు జోడించడం ద్వారా ఆఫ్ఘన్ ఓపెనర్లు రహ్మనుల్లా  గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ పటిష్టమైన పునాది వేశారు. ధాటిగా ఆడిన గుర్బాజ్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేయగా, ఇబ్రహీం జాద్రాన్ 28 పరుగులతో అండగా నిలిచాడు. 

అయితే, ఇతర టాపార్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యంతో 300 లోపు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రహ్మద్ షా (3), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (14), అజ్మతుల్లా ఒమర్జాయ్ (19) ఆకట్టుకోలేకపోయారు. మిడిలార్డర్ లో ఇక్రమ్ అలీఖిల్ ఇంగ్లండ్ బౌలింగ్ దాడులను సమర్థంగా ఎదుర్కొని అర్ధసెంచరీతో మెరిశాడు. అలీఖిల్ 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేసి రీస్ టాప్లే బౌలింగ్ లో అవుటయ్యాడు. రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రెహమాన్ 28 పరుగులతో రాణించారు. 

ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా, స్పీడ్ స్టర్ మార్క్ ఉడ్ 2, రీస్ టాప్లే 1, లియామ్ లివింగ్ స్టన్ 1, జో రూట్ 1 వికెట్ పడగొట్టారు.
World Cup
England
Afghanistan
Delhi

More Telugu News