Milan Fernandez: హీరో అజిత్ సినిమా షూటింగ్ లో విషాదం... ఆర్ట్ డైరెక్టర్ మృతి

Hero Ajith new movie art director dies of heart attack
  • 'విడా ముయార్చి' చిత్రంలో నటిస్తున్న అజిత్
  • ప్రస్తుతం అజర్ బైజాన్ లో షూటింగ్
  • గుండెపోటుతో కన్నుమూసిన ఆర్ట్ డైరెక్టర్ మిలాన్
  • తీవ్ర విషాదంలో చిత్ర యూనిట్ 
తమిళ అగ్ర హీరో అజిత్ కొత్త చిత్రం షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. అజిత్ ప్రస్తుతం 'విడా ముయార్చి' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అజర్ బైజాన్ లో జరుగుతుండగా, ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న మిలాన్ ఫెర్నాండెజ్ గుండెపోటుతో కన్నుమూశారు. 

చిత్రీకరణ సాగుతున్న సమయంలో మిలాన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు తెలిపారు. 

మిలాన్ గతంలో అజిత్ నటించిన బిల్లా, వేదాళం చిత్రాలకు కూడా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మిలాన్ మృతితో 'విడా ముయార్చి' చిత్రయూనిట్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Milan Fernandez
Art Director
Death
Hero Ajith

More Telugu News