rajnath singh: తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh says not only kcr fought for telangana
  • తెలంగాణ రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి వీరులను గన్నదన్న రాజ్‌నాథ్
  • 1984లో బీజేపీ గెలిచిన రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచేనని వెల్లడి
  • బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రోల్ మోడల్‌గా నిలిచిందన్న రాజ్‌నాథ్
  • పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని నిలదీత
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. 

1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, ఆ సమయంలో గెలిచిన రెండింట ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారన్నారు.

గుజరాత్‌లో రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. కానీ పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని, ఇదో ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ఆరోపించారు.
rajnath singh
BJP
KCR
Telangana Assembly Election
Telangana

More Telugu News