Gorantla Butchaiah Chowdary: సజ్జల సారథ్యంలో భారీ కుట్ర జరుగుతోంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Chandrababu has life threat says Gorantla Butchaiah Chowdary
  • చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కార్యక్రమం నడుస్తోందన్న బుచ్చయ్య చౌదరి
  • సెంట్రల్ జైల్ పై డ్రోన్ ఎందుకు ఎగిరిందని ప్రశ్న
  • హెల్త్ బులెటిన్ సక్రమంగా ఎందుకు విడుదల చేయడం లేదని మండిపాటు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కార్యక్రమం నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో భారీ కుట్ర జరుగుతోందని అన్నారు. 

సెంట్రల్ జైల్ పై డ్రోన్ ఎందుకు ఎగిరిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమంగా హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. హెల్త్ బులెటిన్ లోని వివరాలను కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మనుషులా, పశువులా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిని పిచ్చాసుపత్రిలో చేర్చాలని అన్నారు.

Gorantla Butchaiah Chowdary
Chandrababu
Telugudesam
Sajjala Ramakrishna Reddy
YSRCP

More Telugu News