suicide: ప్రవళిక ఆత్మహత్య... శివరాంపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
- నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు
- బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలింపు
ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్ నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రవళిక శిక్షణ తీసుకుంటోంది. గత శుక్రవారం ఆమె హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్షలు రద్దు కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శివరాం అనే యువకుడు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది.