Gaganyaan: గగన్‌యాన్ మిషన్‌లో తొలి ప్రయోగానికి ఇస్రో రెడీ.. పరీక్ష ఎప్పుడంటే..!

Gaganyaan ISRO to launch first development flight of test vehicle on Oct 21
  • అక్టోబర్ 21న టెస్ట్ వెహికిల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ పరీక్ష
  • శ్రీహరికోటలోని స్పేస్‌ సెంటర్‌లో ఉదయం 8.00 గంటలకు ప్రయోగం
  • స్పేస్ సెంటర్ లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని వీక్షించేందుకు అవకాశం ఇచ్చిన ఇస్రో
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన తొలి పరీక్ష చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. శ్రీహరికోటలోని స్పేస్‌ సెంటర్‌లో అక్టోబర్ 21న ఉదయం 8.00 గంటలకు టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలిచిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ఇస్రో సూచించింది. 

వ్యోమగాముల అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో గగన్‌యాన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యుల్‌, రాకెట్‌పై తొలి పరీక్షను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో టీవీ-డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్‌ను సిద్ధం చేసింది. దీని సాయంతో క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రియాశీలకమై క్రూ మాడ్యుల్‌ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఈ క్రమంలో క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది. నావికాదళం సాయంతో ఇస్రో క్రూ మాడ్యుల్‌ను స్వాధీనంలోకి తీసుకుని అందులోని డేటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును విశ్లేషిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్‌ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది.
Gaganyaan
ISRO

More Telugu News