Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ఈ లక్ష్యం ఛేదించేనా...?

Can Afghanistan chase these target against New Zealand
  • వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసిన న్యూజిలాండ్
వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ ను ఓడించి పెను సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్ ఇవాళ న్యూజిలాండ్ తో తలపడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. 

ఓపెనర్ విల్ యంగ్, తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ అర్ధసెంచరీలతో మెరిశారు. విల్ యంగ్ 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేయగా, టామ్ లాథమ్ 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు నమోదు చేశాడు. 

ఇక గ్లెన్ ఫిలిప్స్ 80 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేసి నవీనుల్ హక్ బౌలింగ్ లో అవుటయ్యాడు. రచిన్ రవీంద్ర 32, మార్క్ చాప్ మన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, ముజీబుర్ రెహ్మాన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. 

అయితే, 289 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఛేదించగలదా అన్న సందేహాలను క్రికెట్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ ఆ తర్వాత ఇంగ్లండ్ ను కట్టడి చేసి మ్యాచ్ ను గెలిచింది. నిన్న నెదర్లాండ్స్ కూడా దక్షిణాఫ్రికాపై అలాగే గెలిచింది. ఇవాళ టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ ముందు బ్యాటింగ్ తీసుకుని ఉంటే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఛేజింగ్ లో ఎలాంటి జట్టయినా ఒకట్రెండు వికెట్లు పడితే ఒత్తిడికి గురవుతుందని పేర్కొన్నారు.
Afghanistan
New Zealand
Chennai
ICC World Cup

More Telugu News