raj thackeray: అధికారంలో ఉన్న పార్టీలే ప్రతిపక్షంలోనూ ఉన్నాయి.. ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదు: రాజ్ థాకరే

Maharashtra politics is ugly parties in power are also in opposition says Raj Thackeray
  • అర్థంలేని, అసహ్యకర రాజకీయ పరిణామాలు ఎప్పుడూ చూడలేదన్న రాజ్ థాకరే 
  • శివసేన, ఎన్సీపీకి చెందిన వర్గాలు అధికారంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నాయని వ్యాఖ్య
  • ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నవనిర్మాణ సేన అధ్యక్షుడు
శివసేన, ఎన్సీపీ పార్టీలకు చెందిన వర్గాలు అటు అధికారపక్షంలోనూ, ఇటు విపక్షంలోనూ ఉండటం విడ్డూరమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన్ అధ్యక్షుడు రాజ్ థాకరే అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న పార్టీలే ప్రతిపక్షంలో ఉన్నాయన్నారు.

ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. కేవలం మన రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇలాంటి అర్థంలేని, అసహ్యకర రాజకీయ పరిణామాలను ఎప్పుడూ చూడలేదని వాపోయారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గాలు అధికార పక్షంలో ఉండగా, ఇటు ప్రతిపక్షంలోనూ ఉన్నాయన్నారు.
raj thackeray
Maharashtra
BJP

More Telugu News