Azharuddin: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Non Bailable case on Azharuddin
  • సామగ్రి కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో ఫిర్యాదు
  • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • అగ్నిమాపక పరికరాలు, బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు
మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. 2019-2022 మధ్య ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్లాది రూపాయల గోల్‌మాల్ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ ఫిర్యాదు చేశారు. దీంతో ఉప్ప‌ల్ పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు, బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ సామగ్రి సహా వివిధ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జ‌రిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అజారుద్దీన్‌పై ఐపీసీ 406, 409, 420, 465, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Azharuddin
Cricket
Hyderabad

More Telugu News