Renu Desai: మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా... కారణం చెప్పలేను, కామ్‌గా ఉండటమే బెటర్: రేణుదేశాయ్

Renu Desai did not reveal why she was not acted in Mahesh babu film
  • సర్కార్ వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్
  • అనివార్య కారణాల వల్ల నటించలేకపోయానన్న నటి
  • కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు వెల్లడి
తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో చేయలేకపోయానని నటి రేణుదేశాయ్ వెల్లడించారు. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై స్పందించారు. సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సర్కారువారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు. నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానన్నారు. ఆ కారణాలను మాత్రం వెల్లడించలేనన్నారు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని అన్నారు.
Renu Desai
Tollywood
Mahesh Babu
Sarkaru Vaari Paata

More Telugu News