Toll charges: జాతీయ రహదారులపై ఐదు రాష్ట్రాల గుత్తాధిపత్యం.. ఈ గణాంకాలే నిదర్శనం
- 2022-23లో టోల్ చార్జీల రూపంలో రూ.48వేల కోట్లు
- ఇందులో ఐదు రాష్ట్రాల నుంచే సగం ఆదాయం
- టాప్5లో యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు
జాతీయ రహదారులపై టోల్ చార్జీ వసూలు రూపంలో కేంద్రానికి భారీ ఆదాయం సమకూరుతోంది. 2022-23లో రూ.48,028 కోట్ల ఆదాయం కేంద్రానికి లభించింది. ఈ గణాంకాలను మరింత లోతుగా పరిశీలించి చూస్తే.. దేశవ్యాప్తంగా ఈ టోల్ వసూలు మధ్య సారూప్యత కనిపించడం లేదు. కేవలం ఐదు రాష్ట్రాల పరిధిలోని జాతీయ రహదారుల నుంచే భారీ ఆదాయం సమకూరినట్టు అర్థమవుతుంది.