Congress: 'ఇండియా టుడే సంచలన సర్వే'... కాంగ్రెస్ పార్టీ ట్వీట్
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 54, బీఆర్ఎస్కు 49 సీట్లు వస్తాయన్న సర్వే
- తెలంగాణలో తమ పార్టీ హవా కొనసాగుతుందని కాంగ్రెస్ ధీమా
- 75 సీట్లను టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ
ఇండియా టుడే సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన టీవీ ఫుటేజీని తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. 'ఇండియా టుడే సంచలన సర్వే... కెసిఆర్ కు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్ సభ... కొనసాగుతున్న కాంగ్రెస్ హవా !!' అని పేర్కొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు, బీఆర్ఎస్కు 49 సీట్లు రావొచ్చునని ఇండియా టుడే - సీ వోటరు సర్వే నివేదిక తెలిపింది. బీజేపీ ఎనిమిది, ఇతరులు ఎనిమిది సీట్లు గెలుచుకోవచ్చునని ఈ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే 11 శాతం ఓటు బ్యాంకు పెరిగి 39 శాతానికి, బీఆర్ఎస్కు 9 శాతం తగ్గి 38 శాతానికి పడిపోతుందని, బీజేపీ ఓటు శాతం 7 శాతం నుంచి 9 శాతం పెరిగి 16 శాతానికి చేరుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది.
బీఆర్ఎస్ 49 సీట్లు, మజ్లిస్ పార్టీ 7 సీట్లు గెలుచుకుంటే ఈ రెండు పార్టీలు కలిసినా 56 సీట్లు మాత్రమే ఉంటాయని ఈ సర్వే వెల్లడించింది. అప్పుడు బీఆర్ఎస్కు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే కాంగ్రెస్ 75 సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది.