Jeff Bezos: పాలపై జెఫ్ బెజోస్ పాత రివ్యూ వైరల్.. మస్క్ రియాక్షన్ ఇలా..

Jeff Bezos Review Of Milk Goes Viral Elon Musk Reacts with laughing emoji
  • 2000-2006 మధ్య ఆరు ఉత్పత్తులకు బెజోస్ రివ్యూలు
  • టుస్కాన్ పాలకు ఇచ్చిన రివ్యూ వైరల్
  • లాఫింగ్ ఎమోజీతో స్పందించిన మస్క్
  • సాధారణ యూజర్‌‌కు మించి పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారంటున్న యూజర్లు
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2000-2006 మధ్య తమ వెబ్‌సైట్‌లోని ఉత్పత్తులపై రివ్యూలు చేసేశారు. ఈ ఆరేళ్ల కాలంలో ఆయన ఆరు ఉత్పత్తులను సమీక్షించారు. అలాంటి వాటిలో ఓ పాత రివ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హల్‌చల్ చేస్తోంది. ఇది కాస్తా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంట్లో పడడంతో ఆయన తన శైలిలో స్పందించారు. 

జెఫ్ బెజోస్ 2006లో టుస్కాన్ డెయిరీ హోల్ విటమిన్ డి పాలపై సమీక్ష రాశారు. ‘‘నాకు పాలంటే చాలా ఇష్టం. పుట్టిన తొలి రోజు నుంచే పాలు తాగుతున్నాను. అవి టుస్కాన్ పాలని నేను అనుకోను’’ అని ఆ సమీక్షలో రాసుకొచ్చారు. ట్రుంగ్ ఫాన్ అనే ఎక్స్ యూజర్ తాజాగా ఈ రివ్యూ స్కీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. బెజోస్ అమెజాన్‌లో 9 రివ్యూలు రాశారని, అందులో టుస్కాన్ మిల్క్ కూడా ఒకటని పేర్కొన్నాడు.

బెజోస్ రివ్యూకి మస్క్ లాఫింగ్ ఫేస్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ రివ్యూపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. బెజోస్ రివ్యూలు ఇవ్వడం మానేసినందుకు సంతోషంగా ఉందని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశాడు. ఓ సాధారణ రివ్యూయర్ ఇచ్చే సమీక్షకు మించి టుస్కాన్ పాలకు బెజోస్ అనుకూలంగా రివ్యూ ఇచ్చినట్టు మరో యూజర్ రాసుకొచ్చాడు.
Jeff Bezos
Amazon
Tuscan Dairy
Elon Musk

More Telugu News