Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మిషన్ చాణక్య సర్వే రిపోర్టు
- బీఆర్ఎస్ పార్టీకే మరోమారు ప్రభుత్వ పగ్గాలు
- రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయ సేకరణ
- నాలుగు నెలల పాటు విస్తృతంగా సర్వే
- అధికార పార్టీకే 41.62 శాతం ప్రజల మద్దతు
తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ చాణక్య సంస్థ నిర్వహించిన పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలో నాలుగు నెలల పాటు శ్రమించి, 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు సంస్థ వెల్లడించింది. అధికార పార్టీకి 41.62 శాతం, కాంగ్రెస్ పార్టీకి 32.7 శాతం, బీజేపీకి 17.6 శాతం ప్రజలు మద్దతు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఓటింగ్ జరిగితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కనీసం 76 చోట్ల గెలుస్తుందని తేలింది.
ఈమేరకు నా రాష్ట్రం, నా ఓటు, నా నిర్ణయం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్లు మిషన్ చాణక్య వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి.. మరీ ముఖ్యంగా మేనిఫెస్టో విడుదల చేశాక మహిళల నుంచి భారీగా మద్దతు వ్యక్తమైందని తేలింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై 85 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 44.62 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.