defeat: లీగ్ లో ఒక మ్యాచ్ ఓడినా మంచిదే... ధోనీ కూడా అంతే!: రవిశాస్త్రి
- గ్రూప్ దశలో భారత్ ఓడినా పట్టించుకోనక్కర్లేదన్న రవిశాస్త్రి
- 2011 ప్రపంచకప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని గుర్తు చేసిన మాజీ కోచ్
- అయినా నాడు భారత్ కప్పుకొట్టినట్టు వెల్లడి
ధర్మశాలలోని హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కీలక పోరు మొదలైంది. డాషింగ్ ఓపెనర్ దేవాన్ కాన్వే వికెట్ ను ఆరంభంలోనే తీసి సిరాజ్ న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో భారత్ విజయంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో మందిలో ఫలితం ఏంటా అన్న ఆసక్తి కూడా ఉంది. దీంతో ఈ మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు.
ఆదివారం నాటి గ్రూప్ దశ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైతే తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి ప్రస్తావించారు.
‘‘2011 ప్రపంచకప్ లో భారత్ ఒక గేమ్ లో ఓడిపోయింది. అది లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో. అయినా కానీ టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ సమయంలో కెప్టెన్ ధోనీ చెప్పిన ఓ విషయం గుర్తుకు వస్తోంది. ‘కొన్ని సందర్భాల్లో లీగ్ ఫార్మాట్ లో ఓటమి పాలవ్వడం మంచిదే. ఎందుకంటే తప్పకుండా గెలవాల్సిన సెమీ ఫైనలో లేక ఫైనలో అయితే అప్పుడు వణుకు పుడుతుంది’ అంటూ ధోనీ చెప్పిన నాటి సూచనను శాస్త్రి గుర్తు చేశారు.