Dressing Room Medal Ceremony: ధర్మశాలలో డ్రెస్సింగ్ రూం మెడల్ వేడుక.. బెస్ట్ ఫీల్డర్ కోహ్లీ కాదు.. మరెవరో తెలుసా?

Shreyas Iyer Gets Best Fielder Medal After IND Beat NZ In ODI
  • శ్రేయాస్ అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డ్
  • డ్రెస్సింగ్‌రూంలో ఉత్సాహంగా గడిపిన జట్టు
  • ఇతరుల విజయాన్ని ఎంజాయ్ చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్న షమీ
ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. విజయం తర్వాత డ్రెస్సింగ్ రూంలో జట్టు సరదాగా గడిపింది. ‘ఉత్తమ ఫీల్డర్’ అవార్డు వేడుక సందర్భంగా ఉల్లాసంగా గడిపారు.  ధర్మశాల మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయాస్ అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు లభించింది. ఈ మొత్తం వేడుకను రికార్డు చేసిన బీసీసీఐ దానిని తమ వెబ్‌సైట్‌లో పంచుకుంది. 

ఇతరుల విజయాన్ని కూడా ఎంజాయ్ చేసినప్పుడే మనం మంచి ఫలితాలు సాధించగలుగుతామని షమీ చెప్పుకొచ్చాడు. మరో ఆటగాడు మాట్లాడుతూ.. ధర్మశాలలో కొన్ని కీలక సవాళ్లు ఎదురయ్యాయని, అయినప్పటికీ వాటిని ఎదుర్కోగలిగామని చెప్పాడు. గ్రౌండ్ అటాకింగ్, ఫీల్డింగ్, పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. సిరాజ్ బౌలింగ్‌ను కూడా కొనియాడాడు. స్క్వేర్‌లెగ్‌లో బ్రిలియంట్ క్యాచ్‌తో ఆరంభించిన శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడని కొనియాడాడు. అలాగే, ఇటీవల అద్భుత ఫామ్‌తో ఇరగదీస్తున్న విరాట్ కోహ్లీపైనా ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాన ఆటగాళ్లతోపాటు అందరూ సమష్టిగా ఆడారని, బాగా కష్టపడ్డారని కొనియాడాడు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Dressing Room Medal Ceremony
Shreyas Iyer
Team India
BCCI

More Telugu News