Ram Charan: దసరా వేళ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' నుంచి కలర్ ఫుల్ పోస్టర్

Poster released from Ram Charan starring Game Changer
  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్
  • కియారా అద్వానీ కథానాయిక
  • దిల్ రాజు బ్యానర్ పై భారీ బడ్జెట్ మూవీ
  • దీపావళికి తొలి సాంగ్ విడుదల
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నుంచి దసరా సందర్భంగా ఆసక్తికర పోస్టర్ విడుదలైంది. దీపావళికి 'జరగండి' అనే తొలి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. 

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది. నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఎక్కడ రాజీపడకుండా అంచ‌నాల‌కు దీటుగా 'గేమ్ చేంజ‌ర్‌'ను నిర్మిస్తున్నారు. 

'ఆర్ఆర్ఆర్' వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో 'గేమ్ ఛేంజ‌ర్‌'పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను తెరకెక్కిస్తున్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్‌తో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. 

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా నుంచి తొలి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటిస్తున్నారు.
Ram Charan
Game Changer
Poster
Dasara
Shankar
Dil Raju
Pan India

More Telugu News