Nara Bhuvaneswari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. అక్కడి నుంచి నారావారిపల్లెకు పయనం

Nara Bhuvaneswari went to Naravaripalle from Tirumala
  • నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద పూజలు చేయనున్న భువనేశ్వరి
  • రేపటి నుంచి 'న్యాయం గెలవాలి' పేరుతో యాత్ర
  • చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్వామిని దర్శించుకున్న తర్వాత నారావారిపల్లెకు భువనేశ్వరి వెళ్లారు. నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద ఆమె పూజలు చేయనున్నారు. 

మరోవైపు 'నిజం గెలవాలి' పేరుతో ఆమె రేపటి నుంచి మూడు రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం మూడు రోజుల పాటు ఆమె ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. రేపు చంద్రగిరిలో యాత్ర ప్రారంభంకానుంది.
Nara Bhuvaneswari
Telugudesam
Tirumala
Naravaripalle
Nijam Gelavali

More Telugu News