Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ క్రీడాకారుల్లో మిన్నంటిన సంబరం.. వీడియో ఇదిగో!

Afghanistan players shake legs on Lungi Dance song in the team bus after victory over Pakistan
  • పాక్‌పై విజయంతో ఆప్ఘన్ క్రీడాకారుల సంబరాలు   
  • మైదానంలోనే సంబరాలు చేసుకున్న క్రీడాకారులు 
  • బస్సులో ప్రయాణిస్తూ లుంగీ డ్యాన్స్, నెట్టింట వీడియో వైరల్
తాజా వరల్డ్ కప్‌లో దిగ్గజాలతో పోటీకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ తన సత్తా చాటుకుంటోంది. ప్రతి మ్యాచ్‌లోనూ శక్తిమేరకు పోరాడుతూ విజయం కోసం శ్రమిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలుచుకుని సెమీస్ అవకాశాలను కొంత వరకూ సజీవంగాను ఉంచుకోగలిగింది. 

ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించి తాను పోటీలో ఉన్నానని ఎలుగెత్తి చాటింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పాక్ ప్రదర్శన పేలవంగా ఉన్నా ఆఫ్ఘనిస్థాన్‌ కోణంలో ఇది గొప్పవిజయమే. అందుకే, మ్యాచ్ ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్థాన్ క్రీడాకారుల్లో సంబరం మిన్నంటింది. మైదనంలోనే తమ సంబరాలు మొదలెట్టేసిన క్రీడాకారులు డ్రెస్సింగ్‌ రూంలోనూ వాటిని కొనసాగించారు. బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా వారిలో ఆనందం అంబరాన్నంటింది. దీంతో, షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని లుంగీ డ్యాన్స్‌తో వారందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హర్షాతిరేకాలతో తమను తాము మర్చిపోయి స్టెప్పులేస్తున్న ఆఫ్ఘన్ క్రీడాకారుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Afghanistan
Pakistan
India

More Telugu News