Nara Bhuvaneswari: నారావారిపల్లెలో కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

Nara Bhuvaneswari offers prayers in Naravaripalle
  • ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
  • అనంతరం నారావారిపల్లె చేరుకున్న వైనం
  • గంగమ్మ, నాగాలమ్మకు పూజలు... అత్తమామల సమాధుల వద్ద నివాళులు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు తమ స్వగ్రామం నారావారిపల్లె విచ్చేశారు. ఆమె ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నారావారిపల్లెకు చేరుకున్నారు. 

నారావారిపల్లెలో తమ కులదేవతలైన గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్తమామలు ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారావారిపల్లిలో గ్రామస్తులు, మహిళలు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేసిన వారు... త్వరలో మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. 

నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో తీవ్ర వేదనకు గురై మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది.
Nara Bhuvaneswari
Naravaripalle
Nagalamma
Gangamma
Preyers
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News