Rana Daggubati: ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ .. మెగాస్టార్ తో తలపడే విలన్ గా రానా?

Rana in Chiranjeevi movie
  • సోషియో ఫాంటసీ జోనర్లో చిరూ 
  • యూవీ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా 
  • హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తు
  • సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి  
చిరంజీవి తన 156వ సినిమాను శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇది సోషియా ఫాంటసీ జోనర్లో నడిచే కథ. ఈ తరహా కథలను తెరకెక్కించడం పెద్ద బ్యానర్ల వల్లనే అవుతుంది. అందువల్లనే యూవీ బ్యానర్ వారు ముందుకు వచ్చారు. 

ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క .. నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. కథానాయికల సంగతి అటుంచితే, ప్రతినాయకుడిగా ఎవరు కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో 'రానా' పేరు వినిపిస్తూ ఉండటం విశేషం. 

'రానా'కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది .. పవర్ఫుల్ విలనిజాన్ని పండించడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. అందువలన శ్రీవశిష్ఠ ఆయనను సంప్రదించినట్టుగా .. రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరువాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం .. విలన్ గా రానా పేరు వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Rana Daggubati
Chiranjeevi
Sri Vashista
Keeravani

More Telugu News