Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. కారణం ఇదే!
- తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ అపార్ట్‌మెంట్‌వాసుల ఫిర్యాదు
- పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు
- మద్యం మత్తులో అక్కడ గొడవ
- వారించినా వినకపోవడంతో అరెస్ట్
- గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అరెస్ట్
వివాదాలను అలవాటుగా చేసుకున్న ‘జైలర్’ సినిమా విలన్ వినాయకన్ మరో వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయ్యారు. మద్యం మత్తులో గొడవకు దిగిన ఆయనను కేరళలోని ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆయనను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వినాయకన్ వారితో గొడవకు దిగాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు.
వినాయకన్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అరెస్టై బెయిలుపై బయటకు వచ్చారు. కాగా, మాలీవుడ్‌కు చెందిన వినాయకన్ కల్యాణ్‌రామ్ సినిమా ‘అసాధ్యుడు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమా చేయలేదు. విలన్ పాత్రల్లో కనిపించే వినాయకన్ మంచి డ్యాన్సర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా.