kayden Sharma: ఎంటీవీని ఊపి పడేసిన హైదరాబాదీ ర్యాపర్.. ఈ వీడియో చూస్తే అభిమానులుగా మారడం పక్కా!

CV Anand Shares Hyderabadi Rapper Kayden Sharma MTV Show
  • ఎక్స్‌లో షేర్ చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
  • ఎంటీవీ హస్టిల్ సీజన్-3లో కేదెన్ శర్మ షో
  • ఉర్రూతలూగిపోయన న్యాయనిర్ణేతలు, ఆహూతులు
హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ, రేపర్ కేదెన్‌శర్మ ఎంటీవీ హస్టిల్ సీజన్-3లో దుమ్మరేపాడు. అతడి షోకు న్యాయనిర్ణేతలు, ఆహూతులు మైమరచిపోయారు. ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ గాయకుడి ర్యాప్‌కు శివాలెత్తిపోయారు. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ.. ’ అంటూ స్టేజీని కిక్కెక్కించాడు.

హైదరాబాద్ కల్చర్‌ను, నగరం గొప్పతనాన్ని ర్యాప్‌లో చెబుతుంటే ఊర్రూతలూగిపోయారు. యువత కేరింతలతో కిర్రెక్కిపోయింది. ‘హలో మేడమ్ ఇదర్ మిల్తా డిస్కౌంట్’ అంటే పడిపడీ నవ్వారు. ‘రియాల్టీ చెక్ మిల్తా హర్ దూస్రీ గల్లీమే’ అంటే ఆశ్చర్యపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ వీడియోను పంచుకున్నారు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడమే కాదు.. కేదెన్‌శర్మ పాటకు ఫిదా అయిపోతూ అతడికి అభిమానులుగా మారిపోతున్నారు.
kayden Sharma
MTV Hustle 3.0
Hyderabadi Rapper

More Telugu News