Rajinikanth: నా గుండె ఆనందంతో కొట్టుకుంటోంది: రజనీకాంత్

After 33 years I am working with my mentor says Rajinikanth
  • తెరకెక్కుతున్న రజనీకాంత్ 170వ చిత్రం
  • కీలకపాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్
  • రజనీతో షూటింగ్ లో జాయినైన బిగ్ బీ
'జైలర్' సినిమాతో రజనీకాంత్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అదే ఊపుతో తన 170వ సినిమాకు శ్రీకారం చుట్టారు. 'జైభీమ్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమయింది. కేరళలోని తిరువనంతపురంలోని అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్టేడ్ ను రజనీకాంత్ వెల్లడించారు. 

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. తాజాగా షూటింగ్ లో ఆయన జాయినయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ తెలియజేస్తూ... తన మెంటార్ అమితాబ్ బచ్చన్ తో 33 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్నానని చెప్పారు. నా హృదయం ఆనందంతో కొట్టుకుంటోందని అన్నారు.
Rajinikanth
Amitabh Bachchan
Tollywood
Kollywood
Bollywood

More Telugu News