Stock Market: స్టాక్ మార్కెట్లకు వరుసగా ఐదో రోజు నష్టాలు
- మార్కెట్లపై ఇజ్రాయెల్ - గాజా యుద్ధ ప్రభావం
- 522 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 159 పాయింట్లు పతనమైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. గాజాపై యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 522 పాయింట్లు నష్టపోయి 64,049కి పడిపోయింది. నిఫ్టీ 159 పాయింట్లు పతనమై 19,122 వద్ద స్థిరపడింది.
టాటా స్టీల్ (1.13%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.48%), మారుతి (0.44%), నెస్లే ఇండియా (0.15%).
ఇన్ఫోసిస్ (-2.76%), భారతి ఎయిర్ టెల్ (-1.90%), ఎన్టీపీసీ (-1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.78%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.47%).