Gujarat High Court: జూనియర్ జడ్జిపై సీనియర్ జడ్జి తీవ్ర అసహనం..నసగొద్దంటూ ఆగ్రహం!

Verbal spat between judges in Gujarat high court

  • గుజరాత్ హైకోర్టులో సోమవారం అసాధారణ ఘటన
  • జూనియర్ జడ్జి మౌనా భట్‌పై సీనియర్ జడ్జి బిరేన్ వైష్ణవ్ తీవ్ర అసహనం
  • భిన్నాభిప్రాయం ఉంటే విడిగా తీర్పు ఇవ్వాలని, నసగొద్దని వ్యాఖ్య
  • చేతిలో దస్త్రాన్ని విసిరివేసి వెళ్లిపోయిన వైనం
  • ఘటనపై బుధవారం జస్టిస్ మౌనా భట్ సమక్షంలో విచారం వ్యక్తం చేసిన జస్టిస్ బిరేన్

గుజరాత్ హైకోర్టులో సోమవారం అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో విచారణ సందర్భంగా ఇద్దరు జడ్జీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన తాలూకు దృశ్యాలు హైకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్‌ నుంచి తొలగించినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. 

ఓ కేసుకు సంబంధించి తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ బిరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ మధ్య వివాదం చెలరేగింది. తీవ్ర అసహనానికి లోనైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బిరేన్ తన చేతిలోని దస్త్రాన్ని విసిరేసారు. భిన్నాభిప్రాయం ఉంటే విడిగా తీర్పు ఇవ్వాలని, నసుగుతూ మాట్లాడటం ఆపాలని జస్టిస్ మౌనా భట్‌తో అనడం వీడియోలో రికార్డైంది. ఇకపై తామిద్దరం కలిసి కేసులు విచారించేది లేదంటూ ఆయన తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు దసరా సెలవు కావడంతో బుధవారం జస్టిస్ బిరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ సమక్షంలోనే తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News