Amitabh Bachchan: మీతో నన్ను నేను పోల్చుకోవడమా?.. నెవ్వర్.. రజనీకాంత్ ఎక్స్‌కు అమితాబ్ రిప్లై

My great honour to be working with you again says Amitah about Rajinikanth
  • రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్‌బచ్చన్
  • తలైవర్‌కు అర్థం చెప్పిన బాలీవుడ్ బిగ్‌బీ
  • రజనీతో పనిచేయడం తనకు లభించిన గౌరవమన్న అమితాబ్
దాదాపు  మూడున్నర దశాబ్దాల తర్వాత తన మెంటార్ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందన్న తమిళ తలైవర్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అమితాబ్ స్పందించారు. రజనీకాంత్ సర్ అని సంబోధిస్తూ.. ‘తలైవర్170’ టైటిల్‌ను చూశానని, తలైవర్ అంటే నాయకుడు, అధిపతి, ముఖ్యుడు అని పేర్కొన్నారు. మీరు అధిపతి, నాయకుడు, చీఫ్.. ఈ విషయంలో ప్రజలకేమైనా సందేహముందా? అని ప్రశ్నించారు. తనను తాను రజనీకాంత్‌తో పోల్చుకోలేనని తేల్చి చెప్పారు. మీతో కలిసి మళ్లీ పనిచేయడం తనకు లభించిన గొప్ప గౌరవమంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్ 170వ సినిమాకు రెడీ అయిపోయారు. ‘జైభీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురం అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది.
Amitabh Bachchan
Rajinikanth
THALAIVAR 170

More Telugu News