UN: రెండేళ్లలో భారత్ లో నీటికి కటకట: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
- కీలకమైన టిప్పింగ్ పాయింట్ కు దిగువకు భూగర్భ జలాలు
- 2025 నాటికి పడిపోతాయని ఐక్యరాజ్య సమితిహెచ్చరిక
- ఒక్కసారి ఇది ఏర్పడితే తిరిగి కోలుకోవడం కష్టమని విశ్లేషణ
భారత్ లో నీటికి కటకట తప్పదా..? ఐక్యరాజ్యసమితి ఇదే విషయమై హెచ్చరిస్తోంది. భారత్ లోని ఇండో-గ్యాంగెటిక్ బేసిన్ పరిధిలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. భారత్ లోని వాయవ్య రాష్ట్రాల్లో 2025 నాటికి భూగర్భ జలాలు అత్యంత కనిష్ఠ స్థాయికి (కీలక స్థాయికి దిగువకు) పడిపోతాయని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. వచ్చే నెలలో వాతావరణంపై జరిగే కీలక కాప్28 సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసింది.