Thummala: సీపీ నుంచి డీజీపీ వరకు ఫోన్లు చేశాను... ఫలితం శూన్యం: తుమ్మల ఆవేదన
- మల్సూర్ కూతురు ఎంగేజ్ మెంట్ లో పువ్వాడ మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారన్న తుమ్మల
- కాంగ్రెస్ కార్యకర్తలను పనికట్టుకుని వేధిస్తున్నారని మండిపాటు
- ప్రజలను కాపాడే బాధ్యత తనదే అని వ్యాఖ్య
అధికార బీఆర్ఎస్ పార్టీ, పోలీసు అధికారుల తీరుపై తుమ్మల నాగేశ్వరావు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారని ఆయన అన్నారు. నిన్న మల్సూర్ అనే కాంగ్రెస్ కార్యకర్త కూతురు ఎంగేజ్ మెంట్ లో మంత్రి పువ్వాడ అజయ్ మనుషులు 20 మంది బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పనికట్టుకుని తమ కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని... కంట్రోల్ చేయండని... లేకపోతే ప్రజలు మీమీద తిరుగుబాటు చేస్తారని సీపీ, డీజీపీకి ఫోన్ చేసి చెప్పానని... అయినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఎప్పటికీ కాంగ్రెస్ జిల్లానే అని చెప్పారు. ప్రజలను కాపాడే బాధ్యత తనదని... ప్రజలు గెలిచే ఎన్నిక ఇది అని అన్నారు. ఎంత పోరాటం చేసినా బీఆర్ఎస్ నేతల గుట్టల కబ్జాలు, ప్లాట్ల అమ్మకాలు ఆగడం లేదని విమర్శించారు.