APPSC: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

APPSC announces 4 percent reservations for people with disabilities

  • ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో  దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
  • అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ
  • ఉద్యోగ నిబంధనలకు లోబడి రిజర్వేషన్ అమలు ఉంటుందని వెల్లడి

ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ నిన్న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెం.77 మేరకు ఈ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు పేర్కొంది. 

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారిని దివ్యాంగుల జాబితాలో చేర్చారు. అయితే, ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News