Nara Bhuvaneshwari: తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతున్నాడు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari Interesting Comments On Devansh
  • విదేశాలకు వెళ్లాడని అబద్ధం చెప్పాల్సి వచ్చిందని వెల్లడి
  • నిజం గెలవాలి యాత్ర సభలో మాట్లాడిన నారా భువనేశ్వరి
  • ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులు అయ్యామని విచారం
అక్రమ కేసులతో చంద్రబాబును జైలుకు పంపి 48 రోజులు అవుతోందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నిత్యం ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి ఇన్ని రోజుల పాటు ప్రజలను చూడకుండా ఎన్నడూ ఉండలేదని వివరించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా తిరుపతిలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులు అయ్యామని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇంట్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, మనవడు దేవాన్ష్ కు అబద్ధం చెప్పాల్సి వచ్చిందని అన్నారు.

చంద్రబాబు జైల్లో ఉన్నట్లు తెలియక, ఇంట్లో ఆయన కనిపించకపోవడంతో తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతున్నాడని నారా భువనేశ్వరి చెప్పారు. అయితే, చిన్న వయసు కావడంతో చంద్రబాబు అరెస్ట్ విషయం చెప్పలేదని వివరించారు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతూ వస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

Nara Bhuvaneshwari
Devansh
Chandrababu Arrest
TDP
Andhra Pradesh
Nijam Gelavali

More Telugu News