Yanamala: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు యనమల లేఖ

Yanamala shot a letter to finance AP minister Buggana
  • ఆర్థికశాఖ ఉన్నతాధికారి రావత్ కు రాసిన యనమల
  • తగిన వివరాలు ఇవ్వకపోవడంతో తాజాగా మంత్రి బుగ్గనకు లేఖ
  • శాసనమండలి విపక్ష నేత హోదాలో తాను అడిగిన వివరాలు ఇవ్వాలని స్పష్టీకరణ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థికశాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో యనమల తాజాగా బుగ్గనకు లేఖాస్త్రం సంధించారు. శాసనమండలిలో విపక్ష నేత హోదాలో తాను అడిగిన వివరాలు ఇవ్వాలని బుగ్గనను కోరారు. 

బుగ్గనకు రాసిన లేఖలో యనమల 2021-22 సంవత్సర కాగ్ నివేదికను ప్రస్తావించారు. 67 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ సంస్థకు లెక్కలు సమర్పించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 30 నాటికి ఏపీకి ఉన్న అప్పుల వివరాలు తెలపాలని యనమల స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థల బకాయిల వివరాలు ఇవ్వాలని... ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల లెక్కలు అందించాలని కోరారు.
Yanamala
Letter
Buggana Rajendranath
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News