Rohit Sharma: నెట్‌ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మకు గాయం!.. కొన్ని గంటల్లోనే మ్యాచ్ అనగా బ్యాడ్‌న్యూస్?

Rohit Sharma Gets Injured During Net Practise says reports

  • కుడి చేతి మణికట్టుకు బలంగా తాకిన బంతి
  • భారత శిబిరం ఆందోళన చెందుతున్నట్టు రిపోర్టులు
  • గాయంపై వెలువడని అధికారిక సమాచారం

వరుసగా ఐదు విజయాలతో జోష్ మీద ఉన్న టీమిండియా ఆదివారం(నేడు) లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. మరికొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్ ఆరంభం కానున్న సమయంలో అటు టీమ్‌తోపాటు ఫ్యాన్స్‌కి ఆందోళన కలిగించే న్యూస్ తెలిపింది. కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడ్డట్టు సమాచారం. కుడిచేయి మణికట్టుకు బంతి బలంగా తాకిందని ‘ఇన్‌సైడర్‌స్పోర్ట్’  రిపోర్ట్ పేర్కొంది. ఫిజియో వెంటనే స్పందించారని తెలిపింది. రోహిత్ గాయం టీమిండియా శిబిరంలో ఆందోళనలు రేకెత్తిస్తోందని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత ఎంత అనేది తెలియరాలేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. దీంతో రోహిత్‌కు పెద్ద గాయమే అయ్యిందా, ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో ఆడతాడా లేదా అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. 

లక్నోలో జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ రోహిత్ శర్మకు కీలకమైన మైలురాయి కానుంది. ఈ మ్యాచ్ ఆడితే టీమిండియా కెప్టెన్‌గా 100వ మ్యాచ్ అవుతుంది. అంతేకాదు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి రోహిత్ ఇంకా 47 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రాణిస్తే దిగ్గజ ఆటగాళ్ల సరసన రోహిత్ కూడా చోటుదక్కించుకుంటారు. మరోవైపు ప్రస్తుత ప్రపంచ కప్‌లో రోహిత్ అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 62.20 సగటుతో 311 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News