Sangareddy District: సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ క్యాంప్ క్లర్క్ అనుమానాస్పద మృతి.. హత్యా.. ఆత్మహత్యా?

Sangareddy dist additional collector Madhuri CC Vishnuvardhan died
  • నిన్న మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లని విష్ణువర్ధన్
  • రాత్రి భార్య ఫోన్ చేస్తే మాట్లాడిన వైనం
  • ఈ ఉదయం కాలిన స్థితిలో మృతదేహం గుర్తింపు
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద క్యాంప్ క్లర్క్ (సీసీ)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం కలకలం రేపింది. ఆయనకు భార్య శివకృష్ణకుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఇంటికి వెళ్లలేదు.

గత రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణువర్ధన్ మాట్లాడాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ, ఈ ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద కాలిన గాయాలతో ఆయన మృతి చెంది కనిపించారు. మరోవైపు, ఆయన గత నెల రోజులుగా సెలవులో ఉన్నట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా.. ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Sangareddy District
Additional Collector
Gadila Vishnuvardhan

More Telugu News