Telangana: తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదింపు.. ఎందుకంటే..!

Polling Time Reduced for one Hour In 13 constituencies In Telangana
  • తెలంగాణ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ అప్ డేట్
  • సమస్యాత్మక నియోజకవర్గాలలో సాయంత్రం 4 కే పోలింగ్ ముగింపు 
  • 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది. ఈమేరకు ఈసీ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని మిగతా 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.

ఆ 13 నియోజకవర్గాలు.. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్‌ జరగనుంది.
Telangana
Assembly Elections
13 constituencies
Polling Time
Evening 4 pm
Election commission

More Telugu News