kaali peeli taxis: ముంబై కాలీ, పీలి ట్యాక్సీలకు గుడ్ బై చెప్పిన ఆనంద్ మహీంద్రా

Goodbye kaali peeli taxis Anand Mahindra as iconic Mumbai symbol vanishes

  • నేటి నుంచి ముంబై రోడ్లపై కనిపించని కాలీ పీలి ట్యాక్సీలు
  • కాలం చెల్లిన వీటికి శాశ్వతంగా గుడ్ పై చెప్పేసిన ముంబై
  • వీటితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఆనంద్ మహీంద్రా

మంబై వాసులు ‘కాలీ పీలి ట్యాక్సీ’లను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే వీటికి అంత ఘన చరిత్ర ఉంది. పూర్వ కాలంలో ఓలా, ఊబర్ మాదిరి క్యాబ్ సర్వీసులు లేవు. ముంబై వాసులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఈ కాలీ పీలి ట్యాక్సీలే సేవలు అందించేవి. బ్లాక్, ఎల్లో రంగులతో కనిపించే ఈ కార్లు పద్మినీ కంపెనీవి. కాలం చెల్లిన ప్రీమియర్ పద్మినీ ట్యాక్సీలు చాలా కాలంగా నడుస్తున్నాయి. నేటితో వీటికి ముంబై వాసులు వీడ్కోలు పలుకుతున్నారు. 

ఆనంద్ మహీంద్రా సైతం ఈ అంశంపై తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నేటి నుంచి ఐకానిక్ పద్మిని ప్రీమియర్ ట్యాక్సీ ముంబై రోడ్ల నుంచి కనుమరుగు అవుతోంది. ఇవి శిథిలావస్థకు చేరాయి. అసౌకర్యమైనవి. పెద్దగా శబ్దం చేస్తుంటాయి. లగేజీ పెట్టుకోవడానికి పెద్దగా చోటు కూడా ఉండదు. కానీ, నా లాంటి పాతకాలపు వారికి అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలు పంచాయి. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కు మమ్మల్ని చేర్చాయి. గుడ్ బై అండ్ అల్వీదా, కాలీ-పీలి ట్యాక్సీలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా తన స్పందనను తెలియజేశారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చూసిన యూజర్లలో మరి కొందరు కూడా ఈ ట్యాక్సీలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News