KCR: తెలంగాణలో ఎవరిది గెలుపు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే...?: రాజ్ నీతి సర్వే నివేదిక

Raaj Neethi survey report on telangana elections

  • బీఆర్ఎస్‌కు 77 సీట్లు వస్తాయన్న రాజ్ నీతి సర్వే నివేదిక
  • కాంగ్రెస్‍‌కు 29, బీజేపీకి 6 సీట్లు వస్తాయని సర్వే వెల్లడి
  • హైదరాబాద్‌లోని ఏడు నియోజకవర్గాలను మినహాయించి 112 చోట్ల సర్వే

తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని రాజ్ నీతి సర్వేలో వెల్లడైంది. అధికార పార్టీకి 77 సీట్లు, కాంగ్రెస్‌కు 29, బీజేపీకి 6 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. బీఎస్పీ ఖాతా తెరిచే అవకాశం లేదని సర్వేలో తేలింది. హైదరాబాద్‌లోని ఏడు నియోజకవర్గాలు మినహాయించి 112 స్థానాల్లో సర్వే నిర్వహించింది. ఓటింగ్ శాతం విషయానికి వస్తే బీఆర్‌ఎస్‌కు 43 శాతానికి పైగా ఉండవచ్చునని తెలిపింది.

గ్రామీణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 50 శాతం, పట్టణ ప్రాంతాల్లో 42 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. వయస్సుల వారీగా చూస్తే ముప్పై ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఓటర్లలో 38 శాతం మంది బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల లోపు వారు 40 శాతం, 40-50 ఏళ్ల వయస్సువారు 48 శాతం, 50-60 ఏళ్ల వయస్సువారు 50 శాతం, 60 ఏళ్లకు పైబడిన వారు 51 శాతం మంది కేసీఆర్‌కు ఓటేస్తామన్నారు.

  • Loading...

More Telugu News