Benjamin Netanyahu: ఆ పని చేస్తే మేము హమాస్ కు లొంగిపోయినట్టే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

We dont stop attacs on Gaza says Benjamin Netanyahu
  • గాజాపై దాడులను ఆపే ప్రసక్తే లేదన్న నెతన్యాహు
  • కాల్పులను ఆపితే హమాస్ కు లొంగిపోయినట్టు అవుతుందని వ్యాఖ్య
  • గాజాలో తమ సైన్యం మరింత విస్తరించిందని వెల్లడి
గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ దాడుల కారణంగా గాజా శిథిలమైపోతోంది. మరోవైపు దాడులను ఆపాలని ఇజ్రాయెల్ ను పలు దేశాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై దాడులను ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హమాస్ ను అంతం చేసేంత వరకు దాడులు కొనసాగుతాయని చెప్పారు. తాము కాల్పులను ఆపితే హమాస్ కు లొంగిపోయినట్టు అవుతుందని అన్నారు. గాజా స్ట్రిప్ లో తమ సైన్యం మరింత విస్తరించిందని చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 8,300 మంది చనిపోయినట్టు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Benjamin Netanyahu
Israel
Hamas

More Telugu News