KVP Ramachandra Rao: చంద్రబాబు అరెస్ట్ లో కేంద్రం పాత్ర.. జగన్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం నాటకాలు ఆడుతోంది: కేవీపీ రామచంద్రరావు

Center along with Jagan playing game in Chandrababu arrest
  • చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం పాత్ర ఉందనే విషయాన్ని ఎవరిని అడిగినా చెపుతారన్న కేవీపీ
  • కేంద్రం కనుసన్నల్లోనే అంతా నడుస్తోందని వ్యాఖ్య
  • మద్యాన్ని జగన్ ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని... ముఖ్యమంత్రి జగన్ ను అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతోందని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెపుతారని వ్యాఖ్యానించారు. ఎన్నో రోజులు నిరీక్షించిన తర్వాతే నారా లోకేశ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారని... అమిత్ షా ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్రం కనుసన్నల్లోనే అంతా నడుస్తోందని అన్నారు. 

ఇదే సమయంలో జగన్ పై కేవీపీ విమర్శలు గుప్పించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్... అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని... మద్యం అమ్మకాలలో నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

KVP Ramachandra Rao
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Amit Shah
BJP

More Telugu News