Telangana Elections: తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..: జనతా కా మూడ్ సర్వే

BRS will win in Telangana says Janataki mood survey
  • తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడి
  • బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయన్న సర్వే
  • కాంగ్రెస్ 31 నుంచి 36 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడి
మరో 30 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామేనని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనతాకా మూడ్ సంస్థ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారమని జనతాకా మూడ్ తెలిపింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తేల్చింది.

 బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 వరకు గెలుచుకుంటుందని వెల్లడించింది. బీజేపీ కేవలం 9 నుంచి 7 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఎంఐఎంకు 4 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే... బీఆర్ఎస్ కు 41 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 20 వేల శాంపిళ్లను తీసుకుని సర్వే చేసినట్టు వెల్లడించింది. 

Telangana Elections
Janataki Mood Survey

More Telugu News