Shreyas Iyer: వరల్డ్ కప్ లో అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్... వీడియో ఇదిగో!
- శ్రీలంకపై చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
- 56 బంతుల్లో 82 రన్స్
- 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
- రజిత బౌలింగ్ లో 106 మీటర్ల సిక్స్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఇవాళ ముంబయిలో టీమిండియా, శ్రీలంక మధ్య మంబయి వాంఖెడే స్టేడియంలో వరల్డ్ కప్ లీగ్ పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది.
గిల్ అవుట్ కావడంతో బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్... సొంతగడ్డపై బ్యాట్ ఝళిపించాడు. లంక పేసర్ కసున్ రజిత వేసిన ఓ ఆఫ్ వ్యాలీని లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇది 106 మీటర్ల దూరం దూసుకెళ్లింది. స్టేడియంలో స్టాండ్స్ కు తగిలి కిందపడింది.
ఈ వరల్డ్ కప్ లో ఇదే అత్యంత భారీ సిక్సర్. దాంతో, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కొట్టిన 104 మీటర్ల సిక్సర్ తెరమరుగైంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అయ్యర్ స్కోరులో 3 ఫోర్లు, 6 భారీ సిక్సులు ఉన్నాయి.