Buggana Rajendranath: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు: బుగ్గన

AP financial condition is not good says Buggana Rajendranath Reddy
  • వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న బుగ్గన
  • ఆర్థికంగా మాత్రం కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని వెల్లడి
  • అందుకే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్న ఆర్థిక మంత్రి
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదని చెప్పారు. ఆర్థికంగా కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ కారణం వల్లే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. 
 
రాష్ట్రంలో రాబడి పెరిగిందని, తలసరి ఆదాయం పెరిగిందని భూమన తెలిపారు. ఇప్పటి వరకు ఏపీకి ఉన్న అప్పు గత 60 ఏళ్లలో చేసిందేనని... వైసీపీ ప్రభుత్వంలో చేసింది కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అప్పుల లెక్కలను చెప్పింది కేంద్ర ప్రభుత్వం, కాగ్ అని... కాగ్ ఇచ్చిన లెక్కలపై మళ్లీ ఫోరెన్సిక్ ఆడిట్ ఏమిటని ప్రశ్నించారు. కాగ్ లెక్కలను కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిందని చెప్పారు. 

Buggana Rajendranath
YSRCP
Andhra Pradesh
Financial Condition

More Telugu News