Vijayasai Reddy: టీడీపీ విషయంలో నా అంచనా ఇదే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on TDP future
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • తెలంగాణ టీడీపీలో భారీ కుదుపులు
  • తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంలేదన్న టీడీపీ హైకమాండ్... కాసాని రాజీనామా
  • టీడీపీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనన్న విజయసాయి
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కావడం తెలంగాణలో ఆ పార్టీ పోటీచేసే అంశంపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణ టీడీపీలో తీవ్ర కల్లోలం చెలరేగింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో.... తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం, కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. 

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తెలంగాణలో అసలు ఎక్కడా పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించుకోవడం 1982 తర్వాత ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. "నా అంచనా ప్రకారం 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుంది" అని విజయసాయిరెడ్డి వివరించారు.
Vijayasai Reddy
TDP
Future
YSRCP
Andhra Pradesh

More Telugu News