MIM: తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన ఒవైసీ

First list of MIM candidates

  • ఆరు మందితో తొలి జాబితా విడుదల చేసిన ఒవైసీ
  • పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్ లకు టికెట్ నిరాకరించిన ఎంఐఎం అధినేత
  • పెండింగ్ లో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, బహదూర్ పురా స్థానాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ లను ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు. 

ఎంఐఐం తొలి జాబితా:
  • చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఒవైసీ
  • నాంపల్లి - మజీద్ హుస్సేన్
  • మలక్ పేట్ - అహ్మద్ బలాలా
  • యాకుత్ పురా - జాఫర్ హుస్సేన్
  • చార్మినార్ - జుల్ఫికర్
  • కార్వాన్ - కౌసర్ మొహియుద్దీన్

బహదూర్ పురా, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News