Sachin Tendulkar: కోహ్లీ అత్యధిక వన్డే సెంచరీ రికార్డు కొద్దిలో మిస్.. సచిన్ స్పందన ఇదీ!

Sachin Tendulkar on kohli nearing his one day centuries record

  • తన కెరీర్‌లో 49 వన్డే సెంచరీలు చేసిన సచిన్
  • 48 వన్డే సెంచరీలతో సచిన్ రికార్డుకు చేరువగా కోహ్లీ
  • శ్రీలంకతో మ్యాచ్‌లో సచిన్ రికార్డును సమం చేసే అవకాశం త్రుటిలో మిస్
  • తన రికార్డులు భారతీయ క్రీడాకారులే అధిగమించాలని సచిన్ వ్యాఖ్య

తన రికార్డులు భారతీయ క్రీడాకారులే అధిగమించాలని కోరుకుంటున్నట్టు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తాజాగా వెల్లడించాడు. ప్రస్తుతం అత్యధిక వన్డే సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. సచిన్ 49 వన్డే సెంచరీలు చేశాడు. అయితే, ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ రికార్డును సమం చేసే అవకాశాన్ని విరాట్ కోహ్లీ కొద్దిలో జారవిడుచుకోవాల్సి వచ్చింది. మరో 12 పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందన్న తరుణంలో కోహ్లీ‌ని దిల్షాన్ మధుశంక పెవిలియన్ బాట పట్టించాడు. అప్పటివరకూ కోహ్లీ అత్యధిక వన్డే సెంచరీల రికార్డు కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న అభిమానులు కోహ్లీ నిష్క్రమిణతో ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. ఈ ప్రపంచ కప్‌లో మూడో సెంచరీ అవకాశాన్ని కోల్పోయినందుకు విరాట్ కూడా విచారంలో మునిగిపోయాడు. 

కాగా, కోహ్లీ రికార్డు మిస్సవడంపై స్పందించిన సచిన్ తన రికార్డును సమం చేసే అవకాశం మరో భారతీయుడి ముందు ఉండటంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘‘అది నా రికార్డు కాదు..భారత్ రికార్డు. కాబట్టి, ఇది భారత్ వద్దే ఉన్నంతవరకూ నాకు సంతోషమే’’ అని కామెంట్ చేశాడు. అయితే, శ్రీలంక మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును అధగమించాడు. ఏకంగా ఎనిమిది క్యాలెండర్ సంవత్సరాల్లో జరిగిన వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసి సచిన్‌ను అధిగమించాడు. సచిన్ తన కెరీర్‌లో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News