Assam: అస్సాం యువకుడి యాప్‌ను రూ.416 కోట్లకు కొనుగోలు చేసిన అమెరికా సంస్థ

texts dot com brought by automatic for 416 crores
  • భిన్న వేదికల్లో మెసేజ్ చేసేందుకు ఆల్ ఇన్ వన్ యాప్ తయారు చేసిన కిషన్
  • కిషన్ రూపొందించిన యాప్‌ను కొనుగోలు చేసిన ‘ఆటోమేటిక్’ సంస్థ
  • కోటీశ్వరుడై ఇండియాకు చేరుకున్న కిషన్‌కు దిబ్రూఘడ్‌లో ఘన స్వాగతం
టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడో అస్సాం యువకుడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను ఓ అమెరికా కంపెనీ ఏకంగా రూ.416 కొనుగోలు చేసింది. చారియాలీ ప్రాంతానికి చెందిన మహేంద్ర బగారియా, నమితా బగారియాకుల కుమారుడు కిషన్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ అతడు texts.com అనే ఆన్‌లైన్ ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను సిద్ధం చేశాడు.  వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కు ఈ యాప్ వేదికగా మెసేజీలు పంపించొచ్చు. ఈ వినూత్న యాప్ ఉపయోగాల దృష్ట్యా దీన్ని అమెరికాకు చెందిన ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేసింది. విద్యార్థిగా ఉండగానే కోటీశ్వరుడిగా మారిన కిషన్‌కు దిబ్రూఘడ్‌లో ఘన స్వాగతం లభించింది.
Assam
Tech-News

More Telugu News