Atharva: విడుదలకు సిద్దమైన 'అథర్వ'... డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్

Atharva movie set to release on December 1
  • కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటించిన చిత్రం అథర్వ
  • మహేశ్ రెడ్డి దర్శకత్వంలో అన్ని రకాల ఎమోషన్స్ తో చిత్రం
  • ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం
సస్పెన్స్, క్రైమ్ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ జానర్ తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమే 'అథర్వ'. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

'అథర్వ' చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అథర్వ సినిమాలో క్లూస్ టీం విశిష్టతను, ప్రాముఖ్యతను చూపించేలా గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ జరుగుతోంది.

'అథర్వ' అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. 'అథర్వ' సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 
Atharva
Kartik Raju
Simran Chowdary
Aira
Mahesh Reddy
Subhash Nuthalapati

More Telugu News