Kuwait: అక్రమ వలసలపై కువైట్ ఉక్కుపాదం.. 289 మంది అరెస్టు

Four Fake Offices Exposed 289 Expats Arrested In Kuwait

  • ఫహాహీల్, జహ్రా, ముబారక్ అల్ కబీర్ తదితర ప్రాంతాల్లో సోదాలు
  • అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరణ
  • నాలుగు గృహ కార్మిక ఆఫీసులను బోగస్ గా తేల్చిన అధికారులు

దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై కువైట్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతూ సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిని గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. శిక్ష పూర్తిచేసుకున్నాక వారిని వారి మాతృదేశానికి పంపిస్తున్నారు. వారు మళ్లీ దేశంలో అడుగుపెట్టకుండా బహిష్కరిస్తోంది. అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఫహాహీల్, జహ్రా, ముబారక్ అల్-కబీర్, సల్వా, ఫర్వానియా, వఫ్రా ప్రాంతాలలో భద్రతాధికారులు సోదాలు చేశారు. ఇందులో నాలుగు ఫేక్ ఆఫీసులను గుర్తించి, అందులోని 289 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక్క వఫ్రా ప్రాంతంలోనే 105 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఈ తనిఖీల్లో రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రవాసులపై ప్రధానంగా దృష్టి సారిస్తామని వివరించారు. పట్టుబడ్డ ప్రవాసులను జైలుకు పంపిస్తామని, శిక్ష పూర్తిచేసుకున్నాక ప్రవాసులను వారి స్వదేశానికి పంపించి వేస్తామని చెప్పారు. వారు మరోమారు కువైట్ లో అడుగుపెట్టకుండా బహిష్కరిస్తామని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News