Virat Kohli: కోహ్లీ తన రికార్డును సమం చేయడం పట్ల సచిన్ స్పందన

Sachin reacts on Kohli equalled his most ODI centuries record
  • ఇవాళ కోహ్లీ పుట్టినరోజు
  • దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా సెంచరీ సాధించిన కోహ్లీ
  • వన్డేల్లో కోహ్లీకిది 49వ సెంచరీ
  • సచిన్ 49 సెంచరీల రికార్డు సమం
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరన్న ప్రశ్నకు నేడు మరోసారి స్పష్టమైన సమాధానం వచ్చింది. అంతర్జాతీయ వన్డేల్లో సచిన్ నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్  కోహ్లీ సమం చేశాడు. ఇప్పటివరకు 277 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ నేడు 49వ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ దేవుడు సచిన్ సరసన సగర్వంగా నిలిచాడు.

కోహ్లీ తన ఘనతను అందుకోవడం పట్ల బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ స్పందించారు. బాగా ఆడావు విరాట్ అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. అంతేకాదు, ఇవాళ కోహ్లీ పుట్టినరోజు కూడా కావడంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. 

"నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది... కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకోవాలని కోరుకుంటున్నాను... తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Virat Kohli
Sachin Tendulkar
Most Centuries
ODI
Team India
South Africa
World Cup

More Telugu News